కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ పొలిటికల్ ఎంట్రీ.. బీజేపీలో చేరిక

18 Aug 2026
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ పొలిటికల్ ఎంట్రీ.. బీజేపీలో చేరిక

ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శ్రష్టి వర్మ ‘ఢీ’, ‘ఢీ జోడీ’ వంటి డ్యాన్స్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా’, ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ వంటి పాటలకు కొరియోగ్రఫీ చేసి మరింత పేరు సంపాదించారు. అలాగే ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రానికి కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో ‘న్యాయం చేయరా దేవుడా’ అనే ప్రత్యేక పాటకు ఆమె కొరియోగ్రఫీ చేయడంతో పాటు, ఆ పాటలో స్వయంగా డ్యాన్స్ కూడా చేశారు.

సినీ రంగంలో కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న సమయంలోనే శ్రష్టి వర్మ ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఆమె తీసుకున్న అడుగు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో చేరిన అనంతరం ఆమె ఎలాంటి రాజకీయ బాధ్యతలు చేపడతారు, ప్రజా జీవితంలో తన అనుభవాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.

👍 Like & Share This Article
0 Likes

+