తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రం నుంచి 'డీప్ స్టేట్' పేరుతో విడుదలైన కొత్త గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. సినిమాకు సంబంధించిన కీలక అంశాన్ని సూచించేలా రూపొందించిన ఈ గ్లింప్స్‌లో ఇంటెన్స్ విజువల్స్, ప్రభావవంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
గ్లింప్స్ ప్రారంభంలో రాజీవ్ కనకాల గంభీరమైన స్వరంతో వినిపించిన పవర్‌ఫుల్ డైలాగ్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశం, వ్యవస్థ, అధికారాల వెనుక దాగి ఉన్న శక్తులపై ప్రశ్నలు లేవనెత్తేలా ఉన్న ఆ డైలాగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. గ్లింప్స్‌లో కనిపించే ప్రతి ఫ్రేమ్ కథలోని ఉత్కంఠను, సంఘర్షణను బలంగా ప్రతిబింబిస్తోంది.
'డీప్ స్టేట్' అనే కాన్సెప్ట్‌ను కేంద్రంగా చేసుకుని రూపొందించిన ఈ గ్లింప్స్‌లో రాజకీయాలు, సామాజిక పరిణామాలు, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అదృశ్య శక్తుల నేపథ్యంలో కథ సాగబోతున్నట్లు మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. అయితే కథను పూర్తిగా బయటపెట్టకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే విధంగా గ్లింప్స్‌ను రూపొందించడం విశేషం.
విజువల్స్‌కు తగ్గట్టుగా సాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశానికి మరింత ఎలివేషన్ తీసుకొచ్చింది. చివర్లో వచ్చే టైటిల్ రివీల్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ గ్లింప్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "రాజీవ్ కనకాల వాయిస్ నెక్స్ట్ లెవెల్", "ఇంటెన్స్ ప్రెజెంటేషన్", "కథపై మరింత ఆసక్తి పెరిగింది" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో సుమన్, సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, షఫీ, ప్రభాకర్, కస్తూరి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అస్లాం సంభాషణలు అందించగా, మహావీర్ ఎల్లందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, ప్రముఖ నేపథ్య గాయని సునీత ఆలపించిన గీతం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. వెంకట హనుమ కె. నరిసేటి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సాయి బాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూవింగ్ డ్రీమ్స్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
'డీప్ స్టేట్' గ్లింప్స్ విడుదలతో ధర్మస్థల నియోజకవర్గం సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోతోనే కథలోని ఇంటెన్సిటీని చాటిచెప్పిన మేకర్స్, ఇప్పుడు ట్రైలర్‌లో ఇంకెన్ని ఆసక్తికర అంశాలను చూపించబోతున్నారనే ఉత్కంఠను పెంచారు. విడుదలకు ముందే ఈ చిత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.