నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న #NBK112 సినిమాపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. బడ్జెట్ విషయంలో సమస్యలు, ప్రాజెక్ట్ రద్దు వంటి ప్రచారంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. సినిమా ప్రాజెక్ట్ కొనసాగుతోందని అధికారికంగా వెల్లడించింది.
కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో అమరావతిలో ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 పనుల్లో ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ వెల్లడించారు.
బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ మార్క్ కమర్షియల్ టచ్ కలవడంతో NBK112పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వచ్చిన ప్రచారానికి తాజాగా వచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా కథ, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలపై మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.