కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదలకు సిద్ధమైంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్, స్పై మిషన్, ఉత్కంఠభరితమైన కథనంతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10, 2026న థియేటర్లలోకి రానుంది.
మొదటి భాగంలో సృష్టించిన స్పై యూనివర్స్‌ను మరింత విస్తరిస్తూ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించారు. కార్తీతో పాటు ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు సస్పెన్స్, స్పై ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ‘సర్దార్ 2’పై బజ్ మరింత పెరుగుతోంది. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్తీకి ఉన్న క్రేజ్, మొదటి భాగానికి వచ్చిన ఆదరణ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారుతున్నాయి. మరి ఈ భారీ స్పై యాక్షన్ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్ అందుకుంటుందో సెప్టెంబర్ 10 తర్వాత తేలనుంది.