నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో కొత్త పద్ధతిని ఫాలో అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాకు సాధారణంగా విడుదల చేసే ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. సినిమాలోని కీలక విషయాలు ముందే బయటకు రాకుండా.. ప్రేక్షకులు థియేటర్‌లోనే అసలు అనుభూతిని పొందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాకు సంబంధించిన డార్క్, రా వరల్డ్‌పై ఆసక్తిని పెంచింది. అయితే కథలోని ముఖ్యమైన అంశాలను ఎక్కువగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్న మేకర్స్.. ప్రేక్షకుల కోసం కొన్ని సర్‌ప్రైజ్‌లను థియేటర్లలోనే ఉంచాలని భావిస్తున్నారు. ప్రమోషన్ కంటే సినిమా అనుభవానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న నాని ఆలోచన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాయదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా.. ట్రైలర్ లేకుండానే ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.