సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సినిమా సంగీతానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘వారణాసి’లో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు. రాజమౌళి సినిమాల్లో పాటలు కథనంలో కీలక పాత్ర పోషించే నేపథ్యంలో, ఈ ఆరు పాటలు ఎలాంటి సంగీత అనుభూతిని అందించనున్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారీ విజువల్స్, అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌కు తగ్గట్టుగా పాటలను తీర్చిదిద్దే అవకాశం ఉంది.
ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను సెప్టెంబర్ 2026లో ప్రారంభించనున్నట్లు కీరవాణి వెల్లడించారు. ఈ పనులు కొన్ని నెలల పాటు కొనసాగి, వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. మహేష్ బాబు–రాజమౌళి–కీరవాణి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆరు పాటలతో పాటు బలమైన నేపథ్య సంగీతం ‘వారణాసి’ విజువల్ స్కేల్‌ను మరింత ఎలివేట్ చేస్తుందనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.