‘భోగి’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

21 Aug 2026
‘భోగి’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 28, 2026న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

1960ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథ కోసం అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని పీరియడ్ వరల్డ్‌ను సహజంగా చూపించేందుకు విస్తృతమైన VFX, CGI పనులు అవసరం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత సమయం కేటాయించాలని చిత్రబృందం నిర్ణయించింది.

విడుదల విషయంలో తొందరపడకుండా సినిమాను అనుకున్న స్థాయిలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ ‘గంగ’ అనే పాత్రలో కనిపించనుండగా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొత్త విడుదల తేదీని VFX పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ ప్రకటించనున్నారు.

👍 Like & Share This Article
1 Likes

+