ధనుష్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ‘OM: Chapter 1 – Udhiram: The Blood Wood’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను తొలుత అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే రజినీకాంత్ నటిస్తున్న Jailer 2 అక్టోబర్ 15న విడుదల కానున్న నేపథ్యంలో.. తమ సినిమాను మరో తేదీకి మార్చుతున్నట్లు ధనుష్ అధికారికంగా ప్రకటించారు.
రజినీకాంత్‌పై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధనుష్ తన ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో దీపావళి సందర్భంగా కూడా ‘OM’ను విడుదల చేయబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో సూర్య నటిస్తున్న ‘Scene’ చిత్రానికి విడుదల తేదీ ముందుగానే ప్రకటించబడిందని, ఆ డేట్‌ను గౌరవించాలని తమ టీమ్ నిర్ణయించిందని ధనుష్ వెల్లడించారు. సినిమా రిలీజ్ తేదీల విషయంలో పరస్పర గౌరవం, ఇండస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘OM’ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.