సుహాస్, తమిళ నటుడు సోరి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రం, బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్‌తో పాటు ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను కలిపి రూపొందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కావడంతో అన్ని భాషల ప్రేక్షకులపై మేకర్స్ ఫోకస్ పెట్టారు.
మతిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోరి, సుహాస్ హీరోలుగా కనిపించగా.. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు సత్యరాజ్‌తో పాటు రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించారు. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో పోటీ, ప్రత్యర్థిత్వం, యాక్షన్, భావోద్వేగాలను ఆసక్తికరంగా మేళవించినట్లు తెలుస్తోంది.
సముద్రంలో తెరకెక్కించిన బోట్ యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి కూడా యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సోరి, సుహాస్ నటనకు మంచి స్పందన వస్తోంది. విభిన్నమైన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.