మెగాస్టార్ చిరంజీవి గారు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన, ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. ఎన్నో దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన సినీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాన్స్, సామాజిక నేపథ్య చిత్రాలు.. ఇలా విభిన్న జానర్లలో తనదైన నటనతో మెప్పించిన చిరంజీవి గారు తరతరాల ప్రేక్షకులకు చేరువైన మెగాస్టార్‌గా నిలిచారు.
సినిమా విజయాలకు మించి చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప కోణాన్ని తెలియజేస్తాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు ఎంతోమందికి అండగా నిలిచాయి. సినీ కార్మికులు, పరిశ్రమకు చెందిన వ్యక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు తన వంతు సహాయం అందిస్తూ వచ్చారు. ఇటీవల ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి గారు ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. రమేష్ చికిత్స కోసం చిరంజీవి గారు రూ.3 లక్షలు అందించగా, నాగబాబు మరో రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా రమేష్ కుటుంబానికి మరింత సహాయం అందిస్తామని చిరంజీవి గారు భరోసా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్ర బృందం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నటుడిగా ఆయన సాధించిన అద్భుత విజయాలతో పాటు, అవసరమైన సమయంలో ఇతరులకు అండగా నిలిచే ఆయన గొప్ప మనసును కూడా ఈ సందర్భంగా చిత్ర బృందం కొనియాడుతోంది. ఇటీవల రమేష్‌కు అందించిన సహాయం.. చిరంజీవి గారు తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ ఎందుకు హీరో అనిపించుకుంటారో మరోసారి చాటిచెప్పింది.
తెరపై కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ.. నిజ జీవితంలో సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి అండగా నిలుస్తున్న చిరంజీవి గారి ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఈ ప్రత్యేక రోజున ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్ర బృందం మెగాస్టార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, ఆనందం, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తోంది.