నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన మేకర్స్.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్, అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ద్వారా కనిపిస్తున్న ఆసక్తిని హైలైట్ చేశారు.
ఇదిలా ఉంటే ‘ది ప్యారడైజ్’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని తీవ్రతతో కూడిన యాక్షన్ సన్నివేశాలు, రా అండ్ గ్రిట్టీ ట్రీట్‌మెంట్ కారణంగా ఈ సర్టిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాలో యాక్షన్ ఎంత హార్డ్ హిట్టింగ్‌గా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
సెప్టెంబర్ 24న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ది ప్యారడైజ్’ పై నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా హైప్‌కు తగ్గట్టుగా సాగుతున్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో ఇక థియేటర్లలో సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.