నయనతార మరోసారి అమ్మవారి అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘మూకుత్తి అమ్మన్ 2 – మహాశక్తి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ టీజర్ తాజాగా విడుదలై సినిమాపై అంచనాలను పెంచుతోంది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. తొలి భాగంతో పోలిస్తే మరింత భారీ స్థాయిలో ఫాంటసీ, పౌరాణిక అంశాలు, యాక్షన్‌తో తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్లో గత కాలానికి సంబంధించిన పౌరాణిక ప్రపంచంతో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడా చూపించారు. ఓ రాజ్యంపై ముప్పు, మరోవైపు వర్తమానంలో ఎదురయ్యే విపత్తు.. వీటి మధ్య దైవశక్తి ఎంట్రీ ఆసక్తిని పెంచుతోంది. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు నయనతార మహాశక్తి రూపంలో కనిపించనుండటంతో.. ఈసారి కథలో డివోషనల్ అంశాలతో పాటు భారీ యాక్షన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక నవంబర్ 6, 2026న ‘మూకుత్తి అమ్మన్ 2 – మహాశక్తి’ థియేటర్లలోకి రానుంది. అంటే దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయనతార పవర్ఫుల్ అవతార్, సుందర్.సి టేకింగ్, గ్రాండ్ విజువల్స్, పౌరాణిక ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న కథ.. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. దీపావళి బరిలో ‘మహాశక్తి’ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.