పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కల్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పంజా’ 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి పీక్స్‌కు చేరింది. తెల్లవారుజామునే స్పెషల్ షోలకు భారీగా తరలివచ్చిన అభిమానులు థియేటర్లను పండుగ వాతావరణంగా మార్చేశారు. అప్‌గ్రేడ్ చేసిన 4K ప్రింట్‌తో మరోసారి ‘పంజా’ను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపైంది.
ఏపీ, తెలంగాణలోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, అభిమానుల వేడుకలు, పేపర్ షవర్స్‌తో సందడి కనిపించింది. ఉదయం షోల నుంచే అభిమానుల హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిడ్‌వీక్‌లో రీ-రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలో కనిపించిన ఈ జోష్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానానికి మరోసారి అద్దం పట్టింది.
స్టైలిష్ యాక్షన్, పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అప్పట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘పంజా’.. 4K రీ-రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు సినిమాను ఓ సెలబ్రేషన్‌లా మార్చడంతో ఈ రీ-రిలీజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్ స్టార్ పాత సినిమాలకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ‘పంజా 4K’ సందడి మరోసారి చూపించింది.