‘పవర్ హౌస్’ ప్రోమో.. విక్రమ్‌లో మరో డేంజరస్ షేడ్!

15 Sep 2026
‘పవర్ హౌస్’ ప్రోమో.. విక్రమ్‌లో మరో డేంజరస్ షేడ్!

చియాన్ విక్రమ్ మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో చియాన్ 63గా పిలిచిన ఈ మూవీ టైటిల్ ప్రోమో తాజాగా విడుదలై.. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో పాటు యాక్షన్ టచ్‌ను చూపించింది.

ప్రోమోలో విక్రమ్ పెళ్లిళ్లకు క్యాటరింగ్ చేసే సాధారణ వ్యక్తిగా కనిపించారు. ప్రశాంతంగా, సరదాగా కుటుంబంతో కలిసి పనులు చూసుకునే వ్యక్తిలా ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. అయితే కథ ముందుకు వెళ్లేకొద్దీ ఆయనలో దాగి ఉన్న మరో కోణం బయటపడుతుంది. సాధారణ మనిషి వెనుక ఒక ప్రమాదకరమైన రహస్యం ఉందనే ఆసక్తిని ప్రోమో క్రియేట్ చేసింది.

‘ఐరుముగన్’ తర్వాత విక్రమ్, ఆనంద్ శంకర్ మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘పవర్ హౌస్’పై అంచనాలు పెరుగుతున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. రియా షిబు, ఊర్వశి, షమ్మీ తిలకన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో విక్రమ్ చూపించబోయే కొత్త షేడ్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

👍 Like & Share This Article
0 Likes

+