ప్రభాస్ బర్త్‌డేకు ‘స్పిరిట్’ సర్‌ప్రైజ్?

10 Sep 2026
ప్రభాస్ బర్త్‌డేకు ‘స్పిరిట్’ సర్‌ప్రైజ్?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన చాలా విషయాలను మేకర్స్ రహస్యంగా ఉంచుతుండటంతో.. ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఇక ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘స్పిరిట్’ నుంచి స్పెషల్ యాక్షన్ గ్లింప్స్ విడుదల చేసే ఆలోచనలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన ఆడియో గ్లింప్స్‌కు భిన్నంగా ఈసారి ప్రభాస్‌ను యాక్షన్‌లో చూపించే విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. షూటింగ్‌లో దాదాపు 40 శాతం పూర్తయినట్లు దర్శకుడు గతంలో వెల్లడించారు. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభాస్ బర్త్‌డేకు యాక్షన్ గ్లింప్స్ వస్తే.. సినిమా ప్రమోషన్స్‌కు అది భారీ బూస్ట్ ఇవ్వడం ఖాయం అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

👍 Like & Share This Article
0 Likes

+