నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాతో బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర కోసం సరైన నటుడిని ఎంపిక చేయడానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దాదాపు ఎనిమిది నెలల పాటు వెతికినట్లు వెల్లడించారు.
ఈ పాత్రకు సన్నగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండటంతో పాటు స్టైలిష్‌గా, ప్రశాంతంగా కనిపించే నటుడు కావాలని శ్రీకాంత్ ఓదెల భావించారట. మొదట తెలుగు నటుల్లోనే ఈ పాత్రకు సరైన వ్యక్తి కోసం వెతికినప్పటికీ అనుకున్న విధంగా ఎవరూ దొరకలేదని ఆయన తెలిపారు. ఆ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవ్ జుయల్ ఫొటోను చూపించడంతో దర్శకుడి దృష్టి అతనిపై పడింది. ఆ తర్వాత జరిగిన తొలి భేటీలో రాఘవ్ కాన్ఫిడెన్స్, ఎనర్జీ నచ్చడంతో పాత్రకు అతనే సరైన ఎంపిక అని ఓదెల భావించారు.
రాఘవ్‌ను ఎంపిక చేయడంతో పాత్రలో కూడా కొన్ని మార్పులు చేసినట్లు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. మొదట ఈ పాత్రను మరింత ప్రశాంతంగా, సెటిల్డ్‌గా ఊహించుకున్నప్పటికీ.. రాఘవ్ సహజమైన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత అదే లక్షణాలకు తగ్గట్టుగా క్యారెక్టర్‌ను మార్చినట్లు చెప్పారు. దీంతో ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ జుయల్ పోషిస్తున్న ప్రతినాయక పాత్రపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.