రామ్ చరణ్–సుకుమార్ కాంబో.. RC17కి రంగం సిద్ధం!

09 Sep 2026
రామ్ చరణ్–సుకుమార్ కాంబో.. RC17కి రంగం సిద్ధం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ కొత్త సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా RC17గా పిలుస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా కాలంగా జరుగుతున్న ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో భాగంగా స్క్రిప్ట్‌ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఇక నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకునే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. కథ, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్‌పై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాకపోయినా.. రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మాత్రం ఇప్పటి నుంచే పెరుగుతున్నాయి. ఈసారి ఈ క్రేజీ కాంబో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

👍 Like & Share This Article
0 Likes

+