‘రామాయణం’కు మరో ఘనత.. ప్రపంచవ్యాప్తంగా ScreenXలో విడుదల

20 Aug 2026
‘రామాయణం’కు మరో ఘనత.. ప్రపంచవ్యాప్తంగా ScreenXలో విడుదల

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ‘రామాయణం’ విడుదలకు ముందే వరుసగా సంచలనాలు సృష్టిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, రవి దుబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీఎన్‌ఈజీతో పాటు భారీ అంతర్జాతీయ సాంకేతిక బృందం పనిచేస్తోంది.

ఇప్పుడు ‘రామాయణం’ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ScreenX ఫార్మాట్‌లో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలవనుంది. ScreenXలో సాధారణ స్క్రీన్‌తో పాటు థియేటర్‌ పక్క గోడలపై కూడా దృశ్యాలను విస్తరించి చూపించడం ద్వారా ప్రేక్షకులకు మరింత ఇమ్మర్సివ్ అనుభూతిని అందిస్తారు. ఈ చిత్రాన్ని ScreenXతో పాటు 4DX ఫార్మాట్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఈ చిత్రానికి ScreenX చేరిక మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. తొలి భాగం దీపావళి సందర్భంగా నవంబర్ 2026లో థియేటర్లలోకి రానుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

👍 Like & Share This Article
0 Likes

+