‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఆయన సమర్పణలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘రోమాంచకం’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.
ట్రైలర్‌లో ప్రేమ, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్ అంశాలకు కూడా చోటిచ్చారు. ఆధునిక సంబంధాలు, డేటింగ్ నేపథ్యంలో కథ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సరదాగా మొదలయ్యే ప్రేమకథలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకోవడం, వాటి చుట్టూ వచ్చే వినోదం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
‘రోమాంచకం’ను సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దర్శకుడిగా వేణు గోపాల్ రెడ్డి పరిచయం అవుతున్నారు. సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌తో యూత్‌లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.