సూర్య 47వ సినిమాకు ఎట్టకేలకు అధికారిక టైటిల్ ఖరారైంది. ఇంతకాలం ‘సూర్య 47’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదలైంది. ఇందులో సూర్యను డిఫరెంట్ లుక్, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో చూపించడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య పాత్ర చుట్టూ కథలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో కనిపించిన సూర్య లుక్, యాక్షన్ టచ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నస్లెన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
ఇక సినిమాకు సంబంధించిన అతిపెద్ద అప్‌డేట్‌గా నవంబర్ 6, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సీన్’పై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. 2026లో సూర్య వరుస సినిమాలతో సందడి చేస్తుండగా.. ఈ మూవీ ఆయన అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వనుందో చూడాలి.