భాషతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో త్రిష నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
త్రిష, రాజా కృష్ణ మీనన్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే ఆసక్తి మొదలైంది. సినిమాకు సంబంధించిన కథ, త్రిష పోషించబోయే పాత్ర వంటి వివరాలను మేకర్స్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయితే మరోసారి తనకు భిన్నమైన పాత్రను ఎంచుకున్న త్రిష.. ఈ సినిమాతో కొత్త కోణాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది.
అనుభవజ్ఞురాలైన త్రిషతో పాటు ప్రత్యేకమైన కథలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న రాజా కృష్ణ మీనన్ కలయిక ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. త్వరలోనే మూవీ టైటిల్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్, కథకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది.