వెంకీ–త్రివిక్రమ్ కాంబో.. అక్టోబర్ 2న టార్గెట్!

08 Sep 2026
వెంకీ–త్రివిక్రమ్ కాంబో.. అక్టోబర్ 2న టార్గెట్!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 - AK 47’. ఈ కాంబోపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కుటుంబ కథాంశానికి త్రివిక్రమ్ శైలిని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా వెంకటేష్‌ను సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవతార్‌లో చూపించనుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ వంటి నటులు ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ క్రేజీ కాంబో థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

👍 Like & Share This Article
0 Likes

+