విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు దసరా సీజన్‌ను టార్గెట్ చేయడంతో బాక్సాఫీస్ పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ‘రణబాలి’ 19వ శతాబ్దపు నేపథ్యంతో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 16న ‘రణబాలి’ బరిలోకి దిగుతుండటంతో రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’తో భారీ పోటీ తప్పేలా లేదు. ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానుండగా, ధనుష్ నటిస్తున్న ‘ఓం’ కూడా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 2026 దసరా సీజన్ దక్షిణాది బాక్సాఫీస్‌లో అత్యంత రద్దీగా, ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.