ఏషియన్ గేమ్స్ 2026లో టీమిండియా మరోసారి స్వర్ణ పతకంపై కన్నేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టనుంది. గత ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత్.. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగే ఈ టోర్నీలో పురుషుల టీ20 పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో టీమిండియా తలపడుతుంది. ఈ గ్రూప్‌లో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్ జట్లు ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు మరోసారి గోల్డ్ మెడల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కడంతో భారత్‌కు మంచి ఆరంభ అవకాశం లభించినప్పటికీ.. నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఈసారి కూడా గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలన్నదే టీమిండియా లక్ష్యంగా కనిపిస్తోంది.