కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ యువ బ్యాటర్‌పై BCCI ప్రత్యేక దృష్టి పెట్టింది. అతని ప్రతిభ కొద్ది కాలానికే పరిమితం కాకుండా.. సుదీర్ఘ కెరీర్‌గా మారేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.
వైభవ్ భవిష్యత్‌పై BCCI నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో కూడా చర్చ జరిగింది. అతని ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్, ఆటలో ఎదుగుదల, సరైన మార్గదర్శకత్వం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని బోర్డు భావిస్తోంది. వైభవ్‌తో పాటు మరికొంతమంది యువ ప్రతిభావంతులను కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
చిన్న వయసులోనే వైభవ్ చూపిస్తున్న ఆటతీరు, క్రికెట్‌పై అతని అవగాహన ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇప్పుడు BCCI అతని కెరీర్‌ను దగ్గరగా పర్యవేక్షించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ స్థాయిలో వచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటూ.. స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం వైభవ్ ముందున్న అసలు సవాలుగా మారనుంది.